చరణ్ - అల్లు అర్జున్ ల మధ్య గొడవలా ?

Published on Sep 27,2019 17:16 PM

మెగా హీరోలు రాంచరణ్ - అల్లు అర్జున్ ల మధ్య పొసగడం లేదా ? ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయా ? అంటే అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు అందుకే సైరా నరసింహారెడ్డి వేడుకకు అల్లు అర్జున్ హాజరు కాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికి తోడు మెగా ఫ్యాన్స్ లో చీలిక వచ్చి కొంతమంది అల్లు అర్జున్ ని సపోర్ట్ చేస్తుండగా మరికొంతమంది రాంచరణ్ వైపు ఉన్నారు అంతేకాదు ఒకరి నొకరు తిట్టుకుంటున్నారు కూడా అది కూడా సోషల్ మీడియా సాక్షిగా.
తాజాగా అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు దాంతో సైరా వేడుకలకు రాలేకపోయాడు అయితే అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటోంది కాబట్టి వస్తే ఈ వివాదం పెద్దది అయ్యేది కాదు. ఇక సాధారణంగానే ఎవరి ఇంట్లో నైనా చిన్న చిన్న బేధాభిప్రాయాలు ఉంటాయి అంతమాత్రాన ఇద్దరి మధ్య గొడవలు అనడం ఏంటి ? అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు మరి.