కరోనా ఎఫెక్ట్ : హీరోయిన్ కు ఎంత ఖర్మ పట్టింది ?

Published on Apr 19,2020 11:55 AM
కరోనా ఎఫెక్ట్ తో చూడకూడనివన్నీ చూడాల్సి వస్తోంది జనాలకు. కరోనా మహమ్మారి వియాలతాండవం చేస్తుండటంతో అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. ఇక సినిమా రంగం గ్లామర్ రంగం అనే విషయం తెలిసిందే. హీరోయిన్ ల చుట్టూ హీరోల చుట్టూ మందీ మార్బలం బాగానే ఉంటుంది కానీ కరోనా వల్ల హీరోయిన్ లు అలాగే హీరోలు ఒంటరిగా ఉండాల్సి వస్తోంది.ఇంతకుముందులా చుట్టూ పదిమంది సహాయకులు ఉండటానికి వీలులేదు అలాగే కుదరడం లేదు కూడా లాక్ డౌన్ నిబంధనల వల్ల. దాంతో ఎవరి పనులు వాళ్లే చేసుకోవాల్సి వస్తోంది అందులో హాట్ భామ పాయల్ రాజ్ పుత్ కూడా.

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలనం సృష్టించిన పాయల్ రాజ్ పుత్ కరోనా ఎఫెక్ట్ తో ఇంట్లోనే ఉంటోంది. ఇక ఇంట్లో ఉంటోంది కాబట్టి తన ఇంటిని తానె శుభ్రం చేసుకుంది. ఇంటిని తుడుస్తున్న సమయంలో దిగిన ఫోటోలను అలాగే కరోనా కంటే ముందు గ్లామర్ గా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది పాయల్. ఆ రెండు ఫోటోలలో పాయల్ రాజ్ పుత్ విభిన్న శైలి స్పష్టం అవుతోంది. కరోనా ఎఫెక్ట్ ఎలాంటి వాళ్ళనైనా ఎలా మారుస్తుంది అన్న ఉదాహరణ ఈ ఫోటోతో తేలింది.