ప్రభాస్ సినిమాకు కరోనా ఎఫెక్ట్ !

Published on Mar 31,2020 11:53 AM
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. కరోనా ఎఫెక్ట్ పడింది ప్రభాస్ సినిమాకు దాంతో ఈ సంవత్సరం ఆఖరులో ప్రారంభం కావాల్సిన నాగ్ అశ్విన్ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం కష్టమే అని తెలుస్తోంది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో నాగ్ అశ్విన్ - ప్రభాస్ సినిమా రూపొందనుంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. సైన్స్ ఫిక్షన్ సినిమా కాబట్టి గ్రాఫిక్స్ కూడా ఎక్కువగానే ఉండనున్నాయి.

గ్రాఫిక్స్ కాబట్టి గ్రాఫిక్ వాళ్లతో మాట్లాడాలి కదా ! అయితే కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచంలో చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. లాక్ డౌన్ కాబట్టి గ్రాఫిక్స్ గురించి చర్చించే అవకాశం లేకుండాపోయింది దానికి తోడు ఈ కరోనా ఎప్పుడు అదుపులోకి వస్తుందో తెలియడం లేదు కాబట్టి ఈ ఏడాదిలో ప్రారంభం కావాల్సిన సినిమాని వచ్చే ఏడాదికి మార్చారని వినిపిస్తోంది. ఈలోపు నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ వర్క్ ని మరింత మెరుగు పరిచే పనిలో పడతాడట.