విజయ్ దేవరకొండ ఇంటికోసం అంత ఖర్చు పెట్టాడా ?

Published on Nov 27,2019 15:50 PM

టాలీవుడ్ లో క్రేజీ హీరో ఎవరయ్యా అంటే టక్కున చెప్పే పేరు విజయ్ దేవరకొండ. తాజాగా ఈ హీరో ఫిలిం నగర్ లో అధునాతనమైన ఇంటికి చేరుకున్నాడు. హీరోగా  తన రేంజ్ పెరగడంతో ఫిలిం నగర్ కు మకాం మార్చాడు. దాంతో ఈ కొత్త ఇల్లు ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతోంది. విజయ్ దేవరకొండ కొత్త ఇంటిపై ఇంతగా చర్చ సాగడానికి కారణం ఏంటో తెలుసా ..... ఆ కొత్త ఇంటిని 20 కోట్లతో కట్టించాడట.

తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ హీరో తన అభిరుచి మేరకు అత్యంత అధునాతనమైన బిల్డింగ్ ని కట్టించుకున్నాడు. పైగా ఈ  వేడుకకు కొంతమందిని మాత్రమే ఆహ్వానించాడు దాంతో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మొత్తానికి తనకున్న క్రేజ్ తో కొత్త ఇల్లు కూడా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ.