మహర్షి హిట్టే కాలేదు అప్పుడే రీమేకా ?

Published on May 01,2019 15:49 PM

మహేష్ బాబు నటిస్తున్న మహర్షి చిత్రం ఈనెల 9న భారీ ఎత్తున విడుదల అవుతున్న విషయం తెలిసిందే . అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు హిట్ కాలేదు కానీ అప్పుడే తమిళంలో రీమేక్ అంటూ ప్రచారం చేస్తున్నారు , అలాగే ప్లాన్ చేస్తున్నారట కూడా . ఇక్కడ మహర్షి హిట్ అయితే అప్పుడు తమిళ రీమేక్ గురించి ఆలోచించొచ్చు కానీ ఇంకా రిలీజ్ కానీ సినిమా గురించి చర్చ వ్యర్థమే ! 

అయితే మహర్షి చిత్రాన్ని తమిళ్ లో కనుక రీమేక్ చేస్తే తమిళ స్టార్ హీరో విజయ్ మహేష్ బాబు పాత్ర పోషించాలని అంటున్నారు . తమిళంలో విజయ్ స్టార్ హీరో అన్న విషయం తెలిసిందే . విజయ్ నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్ అయ్యాయి , అలాగే తెలుగులో విజయం సాధించిన పలు చిత్రాలను తమిళ్ లో రీమేక్ చేసాడు విజయ్ .