అఖిల్ కొత్త సినిమా పేరు ఏంటో తెలుసా ?

Published on Feb 03,2020 22:05 PM

అక్కినేని అఖిల్ తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇది అఖిల్ కు నాలుగో చిత్రం దాంతో ఈ సినిమాపై చాలానే ఆశలు పెట్టుకున్నాడు అఖిల్. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. కాగా ఈ సినిమాకు రేపు టైటిల్ ని ఖరారు చేయనున్నారు. ఇంతకీ ఈ సినిమాకు పెడుతున్న టైటిల్ ఏంటో తెలుసా ...... ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ''.

అవును మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అనే టైటిల్ ని ఖరారు చేస్తూ రేపు సాయంత్రం అధికారికంగా ప్రకటన జారీ చేయనున్నారట. అఖిల్ హీరోగా నటించిన మూడు చిత్రాలు అఖిల్ , హలో , మిస్టర్ మజ్ను ప్లాప్ అయ్యాయి దాంతో ఈ నాలుగో సినిమాపై నమ్మకంగా ఉన్నాడు. ఇక దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కూడా ప్లాప్ లతో సతమతం అవుతూ సినిమాలు లేక ఖాళీగా ఉన్న సమయంలో ఈ సినిమా గోల్డెన్ ఛాన్స్ లా వచ్చింది. మరి దీన్ని సద్వినియోగం చేసుకుంటాడో ? లేదో ? చూడాలి.