చిరంజీవి సినిమా పేరు ఏంటో తెలుసా ?

Published on Jan 17,2020 19:15 PM

మెగాస్టార్ చిరంజీవి 152 వ సినిమాకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. కాగా ఆ సినిమాకు కమర్షియల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ సినిమాకు'' గోవిందా ఆచార్య '' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు కూడా ఇదే టైటిల్ వినబడింది కానీ కమర్షియల్ టైటిల్ పెడతారేమో అని అనుకున్నారు కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గోవిందా ఆచార్య అనే టైటిల్ ఖరారు అయినట్లే అని తెలుస్తోంది.

ఈ సినిమా కూడా సందేశాత్మకంగా ఉంటుంది కాబట్టి ఈ టైటిల్ ని అనుకుంటున్నారట దర్శకులు కొరటాల శివ. ఇక ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష నటించనుంది. అలాగే కీలక పాత్రలో రాంచరణ్ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి యుక్తవయసులో ఉన్నప్పటి పాత్రని చరణ్ చేత చేయించనున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మెగా ఫ్యాన్స్ ఆనందానికి అంతే ఉండదు మరి.