ఎన్టీఆర్ కొత్త సినిమా టైటిల్ ఏంటో తెలుసా ?

Published on Jan 26,2020 12:50 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఆ చిత్రానికి త్రివిక్రమ్ పెట్టిన టైటిల్ ఏంటో తెలుసా ...... '' అయినను పోయిరావలె హస్తినకు ''. ఈ గమ్మత్తైన టైటిల్ ని ఆల్రెడీ రిజిస్టర్ చేయించాడట త్రివిక్రమ్. గతకొంత కాలంగా త్రివిక్రమ్ '' అ '' సెంటిమెంట్ గల టైటిల్స్ ని తన సినిమాలకు పెడుతున్న విషయం తెలిసిందే. యాదృచ్చికంగా జరుగుతోందా ? లేదా ? అన్నది పక్కన పెడితే త్రివిక్రమ్ టైటిల్స్ మాత్రం '' అ '' తోనే వస్తున్నాయి.

త్రివిక్రమ్ ఇప్పటివరకు 11 చిత్రాలకు దర్శకత్వం వహిస్తే అందులో '' అ '' సెంటిమెంట్ టైటిల్ తో 6 చిత్రాలు వచ్చాయి. అతడు , అత్తారింటికి దారేది , అజ్ఞాతవాసి , అ ఆ , అరవింద సమేత , అల ...... వైకుంఠపురములో. ఇక ఇప్పుడేమో '' అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ తో ఎన్టీఆర్ హీరోగా సినిమా చేయనున్నాడట. ఇక ఈ సినిమా వేసవిలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఎన్టీఆర్ - త్రివిక్రమ్ లు. అరవింద సమేత విజయం సాధించింది కానీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారట.