టాలీవుడ్ లో టాప్ డ్యాన్సర్ లు ఎవరో తెలుసా ?

Published on Dec 26,2019 16:30 PM

టాలీవుడ్ లో అదరగొట్టే డ్యాన్సర్ లు ఎవరో తెలుసా ......... జూనియర్ ఎన్టీఆర్ , రాంచరణ్ , అల్లు అర్జున్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు హీరో సాయిధరమ్ తేజ్. తాజాగా ఈ హీరో అలీ తో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అందులో టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ లు తారక్ ( జూనియర్ ఎన్టీఆర్ ) చరణ్ , బన్నీ అని తెలిపాడు. ఈ ముగ్గురి డ్యాన్స్ గురించి కూడా వివరిస్తూ మరింత ఆసక్తిని క్రియేట్ చేసాడు. నిజమే టాలీవుడ్ లోనే కాదు టోటల్ సౌత్ లోనే టాప్ డ్యాన్సర్ లు వీళ్ళే అని చెప్పాలి.

డ్యాన్స్ మాస్టర్ లైన ప్రభుదేవా , రాఘవ లారెన్స్ లను పక్కన పెడితే హీరోలలో మాత్రం వీళ్ళు మాత్రమే టాప్. అదిరిపోయే రేంజ్ లో స్టెప్స్ వేస్తూ ప్రేక్షకులను , అభిమానులను బాగానే ఆకట్టుకుంటున్నారు ఎన్టీఆర్ , చరణ్ , అల్లు అర్జున్ లు. తాజాగా ఎన్టీఆర్ - చరణ్ లు ఆర్ ఆర్ ఆర్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. నిజంగా నందమూరి - మెగా అభిమానులకు ఆ సినిమా పెద్ద పండగే అని చెప్పాలి ఎందుకంటే ఎన్టీఆర్ కొమరం భీం గా చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు మరి.