రాములో రాములా అనే పాట ఎవరు పాడాలో తెలుసా ?

Published on Nov 13,2019 17:43 PM

అల్లు అర్జున్ నటిస్తున్న అల ..... వైకుంఠపురములో అనే చిత్రంలో రాములో రాములా అనే పాట యువతని ఉర్రూతలూగిస్తున్న విషయం తెలిసిందే. యుట్యూబ్ ని షేక్ చేస్తున్న ఈ పాటని అసలు ఎవరు పాడాలో తెలుసా ........ బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్. అవును ఎందుకంటే ఆల్రెడీ రాములో రాములా అనే పాట రఫ్ ట్రాక్ రాహుల్ పాడాడు. అయితే అది బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్ళకముందు సంగతి. రఫ్ ట్రాక్ పాడిన రాహుల్ చేతే మళ్ళీ అసలు ట్రాక్ పాడించాలని తమన్ అనుకున్నాడట కానీ రాహుల్ బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లడంతో అన్ని రోజులు వేచి ఉండటం ఇష్టం లేక అనురాగ్ కులకర్ణితో ఒరిజినల్ ట్రాక్ పాడించాడు తమన్.

అలా ...... అల ...... వైకుంఠపురములో రాములో రాములా అనే పాటని మిస్ అయ్యాడు రాహుల్ సిప్లిగంజ్. ఈ విషయాన్నీ తాజాగా రాహుల్ అంగీకరిస్తూ రఫ్ ట్రాక్ నేనే పాడాను కానీ అసలు సమయానికి నేను బిగ్ బాస్ హౌజ్ లో ఉండటంతో సూపర్ హిట్ పాటని మిస్ అయ్యానని అంటున్నాడు. రాములో రాములా అనే పాట యూత్ ని ఒక ఊపు ఊపేస్తోంది. యుట్యూబ్ లో సంచలనమే అయ్యింది ఆ పాట. అయితే ఈ పాట మిస్ అయినా బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు కాబట్టి సంతోషమేగా !