పవన్ కళ్యాణ్ ఎందుకు నటిస్తున్నాడో తెలుసా ?

Published on Jan 31,2020 20:16 PM

రాజకీయాల్లోకి వెళ్లి ఇకపై సినిమాల్లో నటించను అంటూ సంచలన ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్ మళ్ళీ ముఖానికి రంగేసుకుంటున్నాడు. దాంతో కొన్ని విమర్శలు వస్తున్నాయి అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. ఇక సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాత్రం పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ జనసేన పార్టీకి రాజీనామా చేసాడు. దాంతో పవన్ కళ్యాణ్ స్పందించాడు. నాకు వేరే వ్యాపారాలు లేవు అందుకే డబ్బు కోసమే మళ్ళీ సినిమాల్లో నటిస్తున్నాను అని అసలు విషయాన్ని పేర్కొన్నాడు పవన్ కళ్యాణ్.

జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ కు నిజంగానే వేరే వ్యాపారాలు లేవు. జనసేన కార్యక్రమాలకు అలాగే కుటుంబ అవసరాలకు డబ్బు చాలా అవసరం కదా ! పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న డబ్బులు అయిపోయాయి. అలాగే తన కుటుంబంతో పాటుగా తన దగ్గర పనిచేస్తున్న స్టాఫ్ కు జీతాలు ఇవ్వాలి కదా ! ఇలా అన్ని అవసరాలకు డబ్బు ఇవ్వాలంటే సినిమాలు చేయడం తప్పదు మరి. అందుకే ఒకేసారి రెండు సినిమాలలో నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇలా రెండు సినిమాలలో నటించడం ద్వారా పెద్ద మొత్తంలోనే డబ్బులు పవన్ కు అందుతున్నాయి.