హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు ?

Published on Nov 29,2019 17:08 PM

హీరో డాక్టర్ రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈమేరకు ఈ కఠిన నిర్ణయం తీసుకొని ఆర్టీఏ అధికారులకు సిఫారసు చేసారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ కఠిన నిర్ణయానికి రావడానికి కారణం ఏంటో తెలుసా ....... ఆమధ్య డాక్టర్ రాజశేఖర్ వేగంగా డ్రైవ్ చేస్తూ భారీ యాక్సిడెంట్ కు గురి కావడమే ! అయితే అదృష్టవశాత్తు రాజశేఖర్ కు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు భారీ యాక్సిడెంట్ నుండి.

వేగంగా కారు నడిపి భారీ ప్రమాదానికి కారకుడయ్యాడు కాబట్టే రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలనే సిఫారసు చేసారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. అయితే ఈ నిర్ణయాన్ని ఆర్టీఏ అధికారులు సమర్థిస్తారా ? లేక రాజశేఖర్ కు మరో ఛాన్స్ ఇస్తారా ? చూడాలి. మొత్తానికి రాజశేఖర్ కు డ్రైవింగ్ పరంగా కొన్ని ఇబ్బందులు అయితే వచ్చేలాగే కనబడుతున్నాయి.