నితిన్ సినిమా పేరు చెప్పి మోసం చేశారట

Published on Feb 04,2019 17:09 PM

హీరో నితిన్ దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్ లో భీష్మ అనే చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే . అయితే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యేకొద్దీ కొంతమంది దాన్ని దుర్వినియోగం చేసారు . భీష్మ సినిమాలో నటించే అవకాశం అంటూ ఓ వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్ చేసారు ఇంకేముందు బోలెడు మంది యాడ్ అయ్యారు . భీష్మ చిత్రంలో నటించాలనే ఆసక్తి ఉంటే 3 లక్షలు చెల్లించుకోండి , క్యారెక్టర్ ని పట్టుకోండి అని వేలం పాటలా పెట్టారట కొంతమంది డబ్బులు కూడా ఇచ్చారట . 

అయితే ఈ విషయం ఆలస్యంగా దర్శకులు వెంకీ కుడుములకు తెలియడంతో మేము ఎలాంటి వాట్సాప్ గ్రూప్ పెట్టలేదు , డబ్బులు తీసుకోలేదు అదంతా ఎవరో మాయగాళ్ల పని మాకు సంబంధం లేదు అని తేల్చేసాడు . అయితే సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది అన్నది మాత్రం చెప్పలేదు .