మహర్షి బ్లాక్ బస్టర్ అవుతుందట

Published on Feb 01,2019 15:53 PM

మహేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం '' మహర్షి ''. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అశ్వినిదత్ , దిల్ రాజు , పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు . కాగా మహర్షి చిత్రం 2019 బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని , సినిమా అద్భుతంగా వస్తోందని సంచలన వ్యాఖ్యలు చేసాడు దిల్ రాజు . దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది మహర్షి చిత్రం . 

మహేష్ బాబు ఈ చిత్రంలో విభిన్న పార్శ్వాలు ఉన్న పాత్రని పోషిస్తున్నాడు . ఇప్పటికే మహేష్ ఫస్ట్ లుక్ కి అలాగే సెకండ్ లుక్ కి అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే . దాంతో మహర్షి చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది . ఇక ఇప్పుడేమో దిల్ రాజు చెప్పిన మాటల ప్రకారం మహర్షి బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు .