ప్రకాష్ రాజ్ ని బ్యాన్ చేయాలట

Published on Oct 31,2019 11:06 AM
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పై నిషేధం విధించాలని పట్టుబడుతోంది హిందూ మహాసభ. హిందూ దేవుళ్ళ పై అదేపనిగా విమర్శలు చేస్తున్న ప్రకాష్ రాజ్ ని సినిమాల్లో నటించకుండా బ్యాన్ చేయాలనీ కన్నడ చిత్ర పరిశ్రమ కు విజ్ఞప్తి చేసింది హిందూ మహాసభ. ప్రకాష్ రాజ్ గతకొంత కాలంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహార శైలి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాదు అదేపనిగా విమర్శలు కూడా చేస్తున్నాడు.

ఇక పనిలో పనిగా హిందూ దేవుళ్లపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాడు ప్రకాష్ రాజ్ దాంతో హిందూ మహాసభ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే ప్రకాష్ రాజ్ మాత్రం ఈ విషయం పై ఎక్కడా తగ్గడమే లేదు పైగా చర్చా కార్యక్రమాల్లో మరింతగా విమర్శలు చేస్తున్నాడు. సినిమా రంగంలో కూడా ప్రకాష్ రాజ్ పలు వివాదాల్లో ఇరుకున్న సంగతి తెలిసిందే