అల్లు అర్జున్ మహేష్ కు మరోసారి షాక్ ఇవ్వనున్నాడా ?

Published on Mar 09,2020 16:53 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి మహేష్ బాబు కు షాక్ ఇవ్వనున్నాడా ? అనే చర్చ సాగుతోంది. ఇప్పటికే ఈ సంక్రాంతి కి మహేష్ బాబు కు గట్టి పోటీ ఇచ్చి షాక్ ఇచ్చాడు అల్లు అర్జున్. ఈ సంక్రాంతి బరిలో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు , అల్లు అర్జున్ నటించిన అల ..... వైకుంఠపురములో చిత్రాలు విడుదల కాగా రెండు కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి అయితే మాదే పెద్ద హిట్ అంటే లేదు లేదు మాదే పెద్ద హిట్టు అంటూ పోటీపడీమరీ ప్రచారం చేసుకున్నారు.

కట్ చేస్తే మహేష్ బాబు తో చేయాలనుకున్న సుకుమార్ సినిమాని అల్లు అర్జున్ అంగీకరించి షాక్ ఇచ్చాడు. అసలు ఈ సినిమా మహేష్ బాబు తో చేయాలనుకున్నాడు సుకుమార్ కానీ ఎక్కడో తేడా కొట్టడంతో అల్లు అర్జున్ ఓకే చేసాడు. కట్ చేస్తే సెట్స్ మీదకు వెళ్ళింది బన్నీ - సుకుమార్ ల సినిమా. ఈ సినిమా కనుక హిట్ అయితే మహేష్ చేసిన తప్పు అనే తేలుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే మహేష్ బాబుకు అల్లు అర్జున్ మరో షాక్ ఇచ్చినట్లే