బాలయ్య ఇంటిని కూల్చి వేయనున్నారా ?

Published on Dec 13,2019 22:00 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఉంటున్న జూబ్లీహిల్స్ లోని ఇంటిని కూల్చి వేయనున్నారా ? అంటే అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. జూబ్లీహిల్స్ లోని ప్రధాన రహదారి లో బాలయ్య నివాసం ఉంది. అది ఒకప్పుడు లోపల భాగంలో ఉన్న ఇల్లు కాగా జూబ్లీహిల్స్ ప్రాంతం రద్దీ ఎక్కువ కావడంతో ఇప్పుడు అదే ప్రధాన రహదారి అయ్యింది , పైగా బాలయ్య ఇల్లు రోడ్డు పక్కనే ఉంటుంది దానికి తోడు పక్కన మరో ప్రధాన రహదారి ఏర్పడింది. ఇంకేముంది నిత్యం రణగొణ ధ్వనులతో బాలయ్య ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారట.

అందుకే అక్కడ ఉన్న ఇంటిని కూల్చేసి దాన్ని షాపింగ్ మాల్ చేయాలనే ఆలోచన వచ్చిందట. ప్రస్తుతం ఉంటున్న ఇంటిని కూల్చేసి షాపింగ్ మాల్ కట్టిస్తే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి కాబట్టి ఇలా ఆలోచన చేస్తున్నాడట. ఇక ఆ ఇంటి నుండి మరో చోటికి వెళ్లి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోనున్నాడు. అయితే ఎక్కడ ఉండాలి అనేది ప్రశ్నగా మారింది కాబట్టి ఉండటం ఎక్కడ అనేది డిసైడ్ అయితే అప్పుడు ఈ ఇంటిని కూల్చేస్తారట. ఈ ఇంటిని కూల్చేసి షాపింగ్ మాల్ చేస్తే దాని వ్యాల్యూ మరింతగా పెరగడం ఖాయం. ఇప్పటికే వందల కోట్ల ఆస్తులు ఉన్నట్లు బాలయ్య స్వయంగా వెల్లడించాడు. దీనితో బాలయ్య  మరింత శ్రీమంతుడు అవ్వడం ఖాయం.