చంద్రముఖికి సీక్వెల్ చేయనున్నారట !

Published on Jan 03,2020 18:20 PM

2005 లో విడుదలై తెలుగునాట , తమిళనాట ప్రభంజనం సృష్టించిన చిత్రం చంద్రముఖి. సూపర్ స్టార్ రజనీకాంత్ , ప్రభు , జ్యోతిక , నయనతార తదితరులు నటించిన ఆ చిత్రానికి సీక్వెల్ చేయాలని ఎప్పటినుండో దర్శకులు పి. వాసు భావిస్తున్నాడు అయితే అది ఇన్నాళ్లకు కుదరబోతోంది అని తెలుస్తోంది. యాక్షన్ తో పాటుగా హర్రర్ ఎంటర్ టైనర్ గా రూపొందిన చంద్రముఖి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రజనీకాంత్ కు చాలాకాలం తర్వాత బ్లాక్ బస్టర్ ని కట్టబెట్టింది అయితే దానికి సీక్వెల్ చేయాలనీ అనుకున్నారు కానీ ఎందుకో రజనీ వెనకడుగు వేసాడు దాంతో అప్పట్లో అది ఆగిపోయింది.

కట్ చేస్తే తెలుగులో వెంకటేష్ హీరోగా చంద్రముఖి సీక్వెల్ నాగవల్లి అనే టైటిల్ తో చేసారు కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు తెలుగులో. కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేసాడు దర్శకుడు పి. వాసు. రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ కోసమే ఎదురు చూస్తున్నాడట పి. వాసు. ప్రస్తుతం రజనీకాంత్ శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు మరి ఆ సినిమా తర్వాత ఈ చంద్రముఖి సీక్వెల్ ఉంటుందేమో !