మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి జూనియర్ ఎన్టీఆర్ తోడయ్యాడు అలాగే ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కావడంతో పాన్ ఇండియా చిత్రంగా భారీ లెవల్లో విడుదల కానుంది. ఇక సినిమా బ్లాక్ బస్టర్ అయితే చరణ్ రేంజ్ ఊహించతరమా ! అయితే ఇలాంటి సమయంలో తన తదుపరి చిత్రాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి కానీ చరణ్ మాత్రం ఓ కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
అసలే రాజమౌళి దర్శకత్వంలో నటించిన సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది కానీ ఆ తర్వాతి సినిమా డిజాస్టర్ అవుతుందనే సెంటిమెంట్ ఉంది. సెంటిమెంట్ కాదు ఇప్పటివరకు జరిగిన నిజం కూడా. అయినా సరే ఆ సెంటిమెంట్ ని పట్టించుకోకుండా ప్రదీప్ అనే కొత్త కుర్రాడి దర్శకత్వంలో నటించాలనే ఆసక్తితో ఉన్నాడట చరణ్. ఒకవేళ ఇదే కనుక నిజమైతే చరణ్ పెద్ద రిస్క్ చేస్తున్నట్లే !