దర్బార్ నష్టం 20 కోట్లా ?

Published on Feb 08,2020 16:41 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్ చిత్రం 20 కోట్ల నష్టాన్ని బయ్యర్లకు తెచ్చిపెట్టిందని తెలుస్తోంది. దాంతో ఆ నష్టాన్ని భర్తీ చేయాల్సిందిగా నిర్మాత లైకా ప్రొడక్షన్స్ అధినేత చుట్టూ , దర్శకులు మురుగదాస్ చుట్టూ తిరుగుతున్నారట. అయితే సినిమా చేయడానికి దర్శకులు మురుగదాస్ 60 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నాడని మాకు పెద్దగా లాభాలు రాలేదు కాబట్టి మీరు వెళ్లి దర్శకులు మురుగదాస్ ని అడగండి. అక్కడే తేల్చుకోండి అని బయ్యర్లకు చెప్పాడట లైకా అధినేత.

దాంతో బయ్యర్లు మురుగదాస్ ఇంటి చుట్టూ , ఆఫీస్ చుట్టూ తిరుగుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారట. బయ్యర్ల గోల ఎక్కువ కావడంతో దర్శకులు మురుగదాస్ చెన్నై నగర పోలీస్ కమీషనర్ ని కలిసి భద్రత కల్పించాల్సిందిగా కోరాడట. మురుగదాస్ కు దర్బార్ గోల ఎక్కువ కావడంతో పెద్ద తలనొప్పిగా మారిందట. దర్బార్ భారీ వసూళ్లు సాధించింది అయితే ఎక్కువ రేట్లకు సినిమాని అమ్మారు దాంతో బయ్యర్లకు 20 కోట్ల మేర నష్టాలు వచ్చాయట. గతకొంత కాలంగా రజనీకాంత్ నటించిన సినిమాలన్నీ ప్లాప్ అవుతున్నాయి అలాగే బయ్యర్లకు నష్టాలను తెచ్చిపెడుతున్నాయి.