దిల్ రాజు తప్పు చేస్తున్నాడా

Published on Mar 30,2019 10:37 AM

ఈ ఏడాది జనవరిలో రిలీజ్ అయిన ఎఫ్ 2 సంచలన విజయం సాధించింది . ఏకంగా 85 కోట్ల షేర్ సాధించి ప్రభంజనం సృష్టించింది అంతేనా అప్పుల్లో ఉన్న దిల్ రాజు కు అప్పుల ఊబి నుండి బయట పడేసింది . ఎఫ్ 2 నిర్మించడం వల్ల దిల్ రాజుకు ఏకంగా 50 కోట్ల వరకు లాభాలొచ్చాయి దాంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాడు . ఆ ఉత్సాహంతోనే ఎఫ్ 2 చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . 

అగ్ర నిర్మాతగా ఓ వెలుగు వెలిగిన బోనీ కపూర్ తో కలిసి జాయింట్ వెంచర్ గా హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు దిల్ రాజు . అయితే ఈ సినిమా హిందీలో హిట్ అయితే ఫరవాలేదు లేకపోతె పెట్టిన డబ్బులు మొత్తం పోవడం ఖాయం అంటే రిస్క్ అన్నమాట ! తెలుగులో హాయిగా మంచి చిత్రాలు చేస్తూ లాభాలు గడిస్తున్నాడు . ఇలాంటి సమయంలో బాలీవుడ్ కెళ్ళి తీయాల్సిన అవసరం ఏంటో మరి . ఇంతకుముందు ఇలాగే పలువురు హిందీలోకి వెళ్లి నష్టాల ఊబిలో కూరుకుపోయారు మరి .