విజయ్ దేవరకొండ మీద కుట్ర జరుగుతోందా ?

Published on Aug 20,2019 11:01 AM

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ మీద కుట్ర జరుగుతోందా ? అంటే అవుననే అనుమానం వస్తోంది విజయ్ దేవరకొండ మాటలు వింటుంటే . తాజాగా ఈ హీరో తనపై , తన సినిమాలపై కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని , అలాంటి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసనీ వ్యాఖ్యానించడం సంచలనం సృష్టిస్తోంది . అంటే తెరవెనుక విజయ్ దేవరకొండ మీద పెద్ద కుట్ర జరుగుతోందన్న మాట . 

డియర్ కామ్రేడ్ ఇటీవల విడుదలై పరాజయం మూటగట్టుకున్న విషయం తెలిసిందే . డియర్ కామ్రేడ్ చిత్రంపై ఈ హీరో ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కానీ ఆ ఆశలన్నీ అడియాసలు అయ్యాయి . విజయ్ దేవరకొండకు అనూహ్యంగా క్రేజ్ రావడంతో ఇండస్ట్రీలో మాత్రం చాలామందికి అసూయ అయితే ఉంది .