మాజీ ప్రేమికులు మళ్ళీ ఒక్కటి కానున్నారా ?

Published on Apr 19,2020 11:55 AM
మాజీ ప్రేమికులు హన్సిక - శింబు ఒక్కటి కానున్నారా ? మళ్ళీ ప్రేమలో పడ్డారా ? అంటే అవుననే అంటున్నాయి తమిళ వర్గాలు. నయనతారతో పీకల్లోతు ప్రేమాయణం సాగించిన శింబు ఆ ప్రేమని పెళ్లి దాకా తీసుకుపోలేకపోయాడు దాంతో నయనతారతో విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొంత కాలానికే హన్సికని ముగ్గులోకి దించాడు శింబు. అయితే వీళ్ళ ప్రేమాయణం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. హన్సికతో కూడా విబేధాలు వచ్చాయి విడిపోయారు ఇద్దరూ.

కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ శింబు - హన్సిక లు మళ్ళీ ప్రేమలో పడ్డట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి తమిళనాట. హన్సిక తాజాగా 50 వ సినిమాలో నటిస్తోంది ఆ సినిమాలో శింబు గెస్ట్ రోల్ లో నటిస్తుండటంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మొదలయ్యిందట మళ్ళీ. ఇక ఇప్పుడేమో లాక్ డౌన్ నేపథ్యంలో బాగానే మాట్లాడుకుంటున్నారట. దాంతో మళ్ళీ ఈ ఇద్దరూ ఒక్కటే అయినట్లు ఊహాగానాలు చెలరేగాయి. ఎంతైనా శింబు హీరోయిన్ లను పట్టడంలో సిద్ధహస్తుడు అందుకే వరుసపెట్టి హీరోయిన్ లను ముగ్గులోకి దించుతున్నాడు.