హీరో విజయ్ అరెస్ట్ ఖాయమా ?

Published on Feb 08,2020 16:31 PM

ఇళయ దళపతి విజయ్ ని అరెస్ట్ చేయడం ఖాయమా ? అంటే అవుననే అంటున్నాయి చెన్నై వర్గాలు. హీరో విజయ్ 100 కోట్లకు పైగా లెక్కలకు బొక్కలు పెట్టాడని అందుకే అతడ్ని అరెస్ట్ చేసి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఐటీ శాఖాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. తమిళనాట రజనీకాంత్ తర్వాత అంతటి స్టార్ డం ఉన్న హీరో అలాగే భారీ రెమ్యునరేషన్ తీసుకునే హీరో కావడంతో ఐటీ శాఖాధికారులు విజయ్ పై కన్నేశారు. గతకొంత కాలంగా విజయ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ కు ఫైల్ చేస్తున్న ఐటీ కి పొంతన లేదని భావిస్తున్నారట.

దాంతో రెండు రోజుల క్రితం విజయ్ ఇంటిపై ఆఫీసుపై ఐటీ అధికారులు దాడులు చేసి పలు డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో తేడాలు ఉన్నట్లుగా గమనించారట! అందుకే విజయ్ ని అరెస్ట్ చేసి మళ్ళీ ప్రశ్నించాలని చూస్తున్నారట. అయితే విజయ్ స్టార్ హీరో కావడంతో అభిమానులతో ఇబ్బందులు ఉంటాయని భావిస్తున్నారట. విజయ్ బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ సమయంలో ఐటీ దాడులు జరగడంతో కక్ష్య సాధింపు అని భావిస్తున్నారు విజయ్ అభిమానులు.