టాలీవుడ్ లో కూడా ఐటీ దాడులు ఖాయమా ?

Published on Feb 08,2020 16:47 PM

సంక్రాంతి కానుకగా జనవరి 11 న మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు విడుదల కాగా జనవరి 12న అల్లు అర్జున్ నటించిన అల ..... వైకుంఠపురములో చిత్రం విడుదల కాగా ఈ రెండు సినిమాలు కూడా భారీ వసూళ్ళని సాధించిన బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. అయితే ఈ సినిమా దర్శక నిర్మాతలు మాత్రం పోటీపడి భారీ కలెక్షన్లు సాధించినట్లుగా పోటాపోటీగా పోస్టర్ లను విడుదల చేసారు మీడియాకు. ఆ పోస్టర్ లు ఇప్పుడు ఐటీ అధికారులకు మంచి ఛాన్స్ గా నిలుస్తున్నాయి.

దాంతో త్వరలోనే ఈ సినిమాలను నిర్మించిన ఆఫీసులపై ఐటీ దాడులు జరగడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే తమిళనాట విజయ్ నటించిన బిగిల్ చిత్ర నిర్మాత ఇంటిపై దాడులు జరిగాయి అలాగే హీరో విజయ్ ఇంటిపై కూడా. తమిళనాడులో లాగే టాలీవుడ్ లో మరోసారి ఐటీ దాడులు జరగడం ఖాయమని భావిస్తున్నారు. ఈ గోల అంతా రికార్డుల కోసం వేసిన పోస్టర్ ల వల్లే అని తెలుస్తోంది. అయితే రికార్డుల కోసం పోటీగా పోస్టర్ లను వదిలారు కానీ అసలు లెక్కలు మాత్రం ఐటీ అధికారులకు చెప్పాల్సి ఉంటుంది.