జనతా గ్యారేజ్ కాంబినేషన్ రిపీట్ కానుందా ?

Published on May 02,2020 13:44 PM
ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సంచలన విజయం సాధించింది. ఎన్టీఆర్ హీరోగా నటించగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటించారు. హీరోయిన్ లుగా సమంత , నిత్యామీనన్ లు నటించారు. కమర్షియల్ అంశాలతో పాటుగా చక్కని సందేశంతో కూడిన జనతా గ్యారేజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా రాలేదు. కట్ చేస్తే 2022 లో ఈ కాంబినేషన్ లో సినిమా రానున్నట్లు తెలుస్తోంది.

తాజాగా కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత ఎన్టీఆర్ కోసం స్క్రిప్ట్ వర్క్ చేసే పనిలో పడనున్నాడట కొరటాల శివ. ఇక ఎన్టీఆర్ తాజాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అయిననూ పోయిరావలె హస్తినకు అనే సినిమా చేయనున్నాడు దాని తర్వాత కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్.