జూనియర్ ఎన్టీఆర్ గుండుతో కనిపించనున్నాడా ?

Published on Jan 05,2020 12:06 PM

జూనియర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో కొమరం భీం పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ చిత్రంలో కొద్దిసేపు గుండుతో కనిపించనున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఎన్టీఆర్ పోషించే కొమరం భీం పాత్రలో కొద్దిసేపు గుండుతో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే మారువేషంలో తిరుగుతున్న సమయంలో ఇలా గుండుతో కనిపించనున్నాడా ? లేక మరో కారణమా ? అన్నది తేలాల్సి ఉంది. అలాగే ఈ గుండు పాత్ర నిజమేనా ? అన్నది కూడా తేలాల్సి ఉంది.

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో 350 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కొమరం భీం గా చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. జులై 31 న భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది ఆర్ ఆర్ ఆర్ చిత్రం. ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ పై వైజాగ్ పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను జక్కన్న చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ నటిస్తుండగా చరణ్ సరసన అలియా భట్ నటిస్తోంది.