ఎన్టీఆర్ తదుపరి చిత్రం కేజీఎఫ్ డైరెక్టర్ తో ?

Published on Jul 12,2019 11:07 AM

జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ సినిమా తర్వాత కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ ని తీసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించనున్నట్లు తెలుస్తోంది . ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే . దాంతో ప్రశాంత్ పై ప్రశంసల వర్షం కురిసింది . కట్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ తో కలిసి పనిచేయాలని ఆసక్తి చూపిస్తున్నాడు . 

ఈ ఇద్దరినీ సెట్ చేసింది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ . ఇంతకుముందు ఈ బ్యానర్ లో జనతా గ్యారేజ్ చేసాడు జూనియర్ ఎన్టీఆర్ . కట్ చేస్తే ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా సెట్ చేయనున్నారట . ఇక ప్రశాంత్ నీల్ కూడా కేజీఎఫ్ 2 తీస్తున్నాడు . అది రిలీజ్ అయ్యాక అసలు క్లారిటీ వస్తుంది .