లారెన్స్ తమ్ముడు ఇంత నీచుడా ?

Published on Mar 09,2020 16:39 PM

హీరో దర్శక నిర్మాత రాఘవ లారెన్స్ కు సినిమారంగంలో మంచి పేరుంది అలాగే పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే లారెన్స్ కు ఎల్విన్ అనే తమ్ముడు ఉన్నాడు. అతడు ఓ అమ్మాయిని నీచాతి నీచంగా వేధించాడట. నన్ను బలవంతం చేయడానికి ట్రై చేసాడు నేను లొంగకపోవడంతో పోలీస్ అధికారి సహాయంతో నన్ను జైలుకు పంపించాడు ఇప్పటికి కూడా వేధిస్తున్నాడు అంటూ బోరున విలపించింది.

వరంగల్ జిల్లా కు చెందిన ఈ అమ్మాయి తెలుగులో పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. ఆ సమయంలో లారెన్స్ తమ్ముడు ఎల్విన్ పరిచయం అయ్యాడట. అయితే ఈయువతిని చూడగానే తన కోరిక బయటపెట్టాడట ఎల్విన్. అందుకు ఈ యువతి నిరాకరించడంతో మారేడ్ పల్లి ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి తో కలిసి కుట్రకు తెరలేపాడని , నను బ్రోతల్ గా చిత్రీకరించారని జైలు శిక్ష పడేలా చేసారని నాకు న్యాయం కావాలని అడుగుతోంది. ఎల్విన్  లారెన్స్ సోదరుడై ఉండి ఇలా చేయడం ఏంటని షాక్ అవుతున్నారు నెటిజన్లు.