మహేష్ సినిమాలో విజయ్ దేవరకొండ కూడానా ?

Published on Jan 29,2020 16:13 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా మేలో ప్రారంభం కానుంది. మహర్షి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు - వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ కాంబినేషన్ కు మరో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కూడా యాడ్ అవుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో కీలకమైన పాత్రలో విజయ్ దేవరకొండ నటించనున్నట్లు సమాచారం.

యువతలో విజయ్ దేవరకొండకు విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. కాగా దాంతో విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నటిస్తే తప్పకుండా ఆ సినిమా రేంజ్ మరో లెవల్ కి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వార్త నిజమే అయితే మహేష్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు కూడా పెద్ద పండగే అని చెప్పాలి. ఈ ఇద్దరు హీరోలను స్క్రీన్ పై ఒకే ఫ్రేమ్ లో కనుక చూస్తే థియేటర్ లో ఈలలే ఈలలు గోలలే గోలలు. థియేటర్ లన్ని దద్దరిల్లిపోవాల్సిందే ఇక.