మహేష్ ఆ డైరెక్టర్ ని పక్కన పెట్టాడా ?

Published on Feb 22,2020 18:39 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా మేలో  ప్రారంభం కానుందని అనుకుంటుండగా తాజాగా వినబడుతున్న కథనం ప్రకారం ఆ సినిమా ఆగిపోయినట్లే అని అంటున్నారు. అయితే వంశీ పైడిపల్లి సినిమా పూర్తిగా ఆగిపోలేదని కాకపోతే హోల్డ్ లో మాత్రమే పెట్టాడని , స్క్రిప్ట్ లో మార్పులు చెప్పాడని అవి కంప్లీట్ అయితే అప్పుడు మాత్రమే సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది.

మాఫియా నేపథ్యంలో తెరకెక్కే చిత్రం కావడంతో పక్కాగా స్క్రిప్ట్ వస్తేనే సెట్స్ మీదకు తీసుకెల్దామని గట్టిగానే చెప్పాడట మహేష్ బాబు. ప్రస్తుతం వంశీ పైడిపల్లి కథలో మార్పులు చేసే పనిలో పడ్డాడు. అయితే ఈ ప్రక్రియ ఫలవంతం అయితేనే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. లేదంటే మహేష్ బాబు మరో సినిమా చేయడం ఖాయం.