నిఖిల్ -నివేదా ల సినిమా ఆగిపోయిందా ?

Published on Mar 11,2019 11:53 AM

యంగ్ హీరో నిఖిల్ - నివేదా థామస్ లు జంటగా నటించనున్న '' శ్వాస '' సినిమా ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి . గత ఏడాది దసరా సందర్బంగా శ్వాస సినిమా ప్రారంభమైంది . ఇక రెగ్యులర్ షూటింగ్ జరగడమే తరువాయి అని అనుకున్నారు . కానీ సినిమా ప్రారంభమై అయిదు నెలలు దాటినప్పటికీ రెగ్యులర్ షూటింగ్ జరగడం లేదు సరికదా ! ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్ళనుందో  కూడా తెలియడం లేదు . 

తాజాగా ఈ హీరో అర్జున్ సురవరం అనే చిత్రం చేస్తున్నాడు . తమిళంలో విజయం సాధించిన కనితన్ అనే చిత్రాన్ని రీమేక్ చేసారు . ఈనెల 29 న అర్జున్ సురవరం ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక ఈ సినిమా తర్వాత కార్తికేయ 2 చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు నిఖిల్ దాంతో శ్వాస ఆగిపోయినట్లేనా అనే అనుమానం మొదలయ్యింది .