నితిన్ రిస్క్ చేస్తున్నాడా ?

Published on Mar 13,2020 21:26 PM
ఇప్పటికే నితిన్ కృష్ణచైతన్య దర్శకత్వంలో ఒకసారి నటించాడు అయితే అది డిజాస్టర్ అయ్యింది కట్ చేస్తే మరోసారి కృష్ణచైతన్య కు ఛాన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. '' పవర్ పేట '' అనే చిత్రం నితిన్ కృష్ణచైతన్య దర్శకత్వంలో చేయనున్నాడు. పైగా ఈ సినిమాని ఒక పార్ట్ గా కాదు బాహుబలి లాగా రెండు పార్ట్ లుగా చేయనున్నారట. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ సినిమాలో నితిన్ 18 ఏళ్ల యువకుడిగా అలాగే 40 ఏళ్ల యువకుడిగా అలాగే 60 ఏళ్ల ముసలాడిగా కూడా నటించనున్నాడట.

నితిన్ క్యారెక్టర్ లో డిఫరెంట్ షేడ్స్ ఉండనున్నాయట. పవర్ పేట అనే టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రం కోసం నితిన్ పెద్ద రిస్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కృష్ణచైతన్య దర్శకుడిగా సత్తా చాటలేకపోయాడు అయినప్పటికీ మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాడు నితిన్. తాజాగా భీష్మ అనే చిత్రంతో సూపర్ హిట్ కొట్టి మళ్ళీ లైన్ లోకి వచ్చాడు నితిన్.