ఆర్ ఆర్ ఆర్ లో ప్రభాస్ కూడా

Published on Apr 15,2019 14:57 PM

ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం '' ఆర్ ఆర్ ఆర్ ''. కాగా ఆ చిత్రంలో ఎన్టీఆర్ , రాంచరణ్ లు హీరోలు అన్న విషయం కూడా విదితమే ! అయితే ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో హీరో ప్రభాస్ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది . బాహుబలి చిత్రంతో ప్రభాస్ రేంజ్ అనూహ్యంగా పెరిగింది దాంతో ప్రభాస్ ని కూడా ఈ చిత్రంలో పార్ట్ చేయాలనీ భావిస్తున్నాడట జక్కన్న . 

ప్రభాస్ చేత గెస్ట్ అప్పియరెన్స్ ఇప్పించడం కానీ లేదంటే వాయిస్ ఓవర్ ఇప్పించడం కానీ చేయాలనీ భావిస్తున్నారట జక్కన్న . అయితే ఏది బెటర్ ? ఎలా చేయించాలి అన్న దానిపై మాత్రం ఇంకా ఓ నిర్ణయానికి మాత్రం రాలేదట ! ఒకవేళ ప్రభాస్ నటించినా ...... వాయిస్ ఓవర్ ఇచ్చినా ఆర్ ఆర్ ఆర్ కు మరింత పప్లస్ అవ్వడం ఖాయం . ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెండు షెడ్యూల్ లను పూర్తిచేసుకున్న ఆర్ ఆర్ ఆర్ మూడో షెడ్యూల్ మాత్రం అప్ సెట్ అయ్యింది . త్వరలోనే మూడో షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న .