ప్రభాస్ పెళ్లి ఖాయమైందా ? మరి అనుష్క సంగతి ?

Published on May 06,2019 15:53 PM

ప్రభాస్ పెళ్లి ఖాయమైపోయినట్లే అంటూ ఓ వార్త హల్చల్ చేస్తోంది . 39 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదు దాంతో చాలారోజులుగా ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు ఈ హీరో వెంట పడుతూనే ఉన్నాడు . ఇక ఆరు సంవత్సరాలుగా అయితే పోరు పెడుతూనే ఉన్నాడు . అదిగో ఇదిగో అంటూ ఇన్నాళ్లు నెట్టుకుంటూ వచ్చన ప్రభాస్ ఎట్టకేలకు పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది . అమెరికాలో ఎం బి ఏ చేస్తున్న అమ్మాయిని సెలెక్ట్ కూడా చేశారట . ఇక పెళ్లి కావడమే తరువాయి , ఫలానా అమ్మాయి అని చెప్పడమే తరువాయి అని తెలుస్తోంది . 

అయితే ప్రభాస్ పెళ్లి చేసుకుంటే అనుష్క సంగతి ఏంటి ? ప్రభాస్ - అనుష్క లు పలు చిత్రాల్లో జంటగా నటించి మంచి జోడి అనిపించుకున్నారు . ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కూడా జోరుగా సాగుతొందని పుకార్లు షికారు చేస్తున్న విషయం తెలిసిందే . ప్రభాస్ కు 39 ఏళ్ళు కాగా అనుష్క కు 37 ఏళ్ళు . ఇద్దరి మధ్య రెండేళ్లు తేడా పైగా మంచి జోడి కూడా . ఒకవేళ ప్రభాస్ పెళ్లి చేసుకొని వెళ్లపోతే అనుష్క సంగతి ఏంటో ?