ప్రభాస్ రెమ్యునరేషన్ 100 కోట్లా ?

Published on Mar 07,2020 11:20 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఆ సినిమా కోసం ప్రభాస్ తీసుకునే రెమ్యునరేషన్ ఎంత ? అనే చర్చ సాగుతోంది అప్పుడే . ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడం ఖాయమని వినిపిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ఎక్కువ శాతం గ్రీన్ మ్యాట్ లో చేయనున్నారు గ్రాఫిక్ వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు పని చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ భారీ రెమ్యునరేషన్ తీసుకోనున్నాడట ప్రభాస్.

అయితే ఇందులో దాదాపు 70 కోట్ల వరకు ప్రభాస్ రెమ్యునరేషన్ కాగా మిగతా సొమ్ములు తనతో పనిచేసే వాళ్లకు అంట. అంటే మొత్తం కలిపి 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ఫిలిం నగర్ సర్కిల్లో వినిపిస్తోంది. పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందనుంది. ఇక ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 400 కోట్ల బడ్జెట్ తో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మించనున్నాడు.