పూరి జగన్నాధ్ తదుపరి చిత్రం విజయ్ దేవరకొండతో ?

Published on Aug 05,2019 12:09 PM

ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు దర్శకులు పూరి జగన్నాధ్ , దాంతో ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తో సినిమా చేయడానికి సన్నాహాలు. ఆల్రెడీ విజయ్ దేవరకొండ ని కలిసి మాట్లాడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి ఫిలిం నగర్ సర్కిల్లో . ఇక విజయ్ దేవరకొండ కూడా డియర్ కామ్రేడ్ ప్లాప్ కావడంతో పూరి తో కలిసి చేయాలనే ఆలోచన చేస్తున్నాడట . 

విజయ్ దేవరకొండ కు సరిపడా కథ దొరికితే తప్పకుండా బ్లాక్ బస్టర్ కొట్టొచ్చు . ఎందుకంటే విజయ్ దేవరకొండ కు మంచి క్రేజ్ ఉంది మరి . దాన్ని క్యాష్ చేసుకోవాలంటే పూరి లాంటి మాస్ డైరెక్టర్ పడితే తప్పకుండా రికార్డులు బద్దలు కొట్టొచ్చు . ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే .