హీరోగా రాజ్ తరుణ్ పని అయిపోయిందా ?

Published on Dec 28,2019 16:53 PM

ఉయ్యాలా జంపాలా చిత్రంతో హీరోగా పరిచయమైన రాజ్ తరుణ్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టాడు. అలాగే హీరోగా మంచి ఇంప్రెషన్ కలిగించాడు. టాలీవుడ్ కు మరో యంగ్ హీరో దొరికాడు అనిపించాడు. ఆ సినిమా తర్వాత చేసిన కుమారి 21 f , సినిమా చూపిస్త మామ ,  ఈడోరకం ఆడోరకం చిత్రాలతో మంచి విజయాలు అందుకున్నాడు. అయితే ఆ తర్వాత నుండి వరుసగా దెబ్బలు తింటున్నాడు పాపం ఈ కుర్ర హీరో. ఇటీవలే డిసెంబర్ 25 న రాజ్ తరుణ్ నటించిన ఇద్దరి లోకం ఒకటే చిత్రం విడుదల అయ్యింది. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.

దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత నిర్మించి , విడుదల చేసిన చిత్రం అయినప్పటికీ కనీసం ఓపెనింగ్స్ ని కూడా సాధించలేకపోయింది. ఓపెనింగ్ రోజున కేవలం 16 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. ఇక రెండో రోజు నుండి ఆ సినిమా పత్తా లేకుండాపోయింది. అంతకుముందు నటించిన చిత్రాలు రాజుగాడు , లవర్ , రంగుల రాట్నం , సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు , కిట్టు ఉన్నాడు జాగ్రత్త కూడా ప్లాప్ అయ్యాయి. వరుసగా రాజ్ తరుణ్ నటించిన చిత్రాలు ప్లాప్ అవుతుండటంతో ఇద్దరి లోకం ఒకటే కూడా ప్లాప్ జాబితాలో చేరిపోయింది. దాంతో హీరోగా రాజ్ తరుణ్ పని అయిపోయినట్లే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.