బిగ్ బాస్ 3 లో రేణు దేశాయ్ నిజమేనా ?

Published on Jun 13,2019 11:50 AM

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తెలుగు బిగ్ బాస్ 3 షోలో పాల్గొననున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే హీరోయిన్ గా , దర్శకురాలిగా , పవన్ కళ్యాణ్ మాజీ భార్య బిగ్ బాస్ 3 లో పార్టిసిపేట్ చేస్తుంది అంటే డౌటే ! కానీ వినబడుతున్న కథనం ప్రకారం రేణు దేశాయ్ మాత్రం లిస్ట్ లో ఉంది . అయితే ఆమె ఓకే చేస్తుందా ? లేదా? అన్నది తేలాల్సి ఉంది కానీ ఒకవేళ రేణు దేశాయ్ బిగ్ బాస్ 3 లో ఉంటే రచ్చ రచ్చే ! 

పవన్ కళ్యాణ్ తో సహజీవనం చేస్తూ పెళ్ళికి ముందే ఒక కొడుకుని కన్న రేణు దేశాయ్ ఆ తర్వాత పెళ్లి చేసుకొని మరొక బిడ్డకు తల్లి అయ్యింది . అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు ఎక్కువ కావడంతో విడాకులు తీసుకున్నారు . దాంతో హైదరాబాద్ నుండి వెళ్ళిపోయి పూణేలో ఉంటోంది రేణు దేశాయ్ . అయితే రేణు దేశాయ్ బిగ్ బాస్ 3 లో పాల్గొంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గోల చేయడం ఖాయం .