శర్వానంద్ ఆ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోవడం లేదా ?

Published on Mar 09,2020 16:53 PM

యంగ్ హీరో శర్వానంద్ నటించిన చిత్రాలు గతకొంత కాలంగా ప్లాప్ అవుతూ వస్తున్నాయి దాంతో తాజాగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటించే చిత్రానికి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నాడు. ఇంతకుముందు చెరుకూరి సుధాకర్ శర్వానంద్ హీరోగా పడిపడి లేచె మనసు చిత్రాన్ని నిర్మించాడు. ఆ సినిమా ఘోర పరాజయం పొందడంతో పెద్ద మొత్తంలోనే నష్టపోయాడు నిర్మాత.

అందుకే తన తదుపరి చిత్రాన్ని మళ్ళీ చెరుకూరి సుధాకర్ తో చేయడానికి నిర్ణయం తీసుకున్నాడట ! ఇక ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట ! కాకపోతే సినిమా హిట్ అయి లాభాలు వస్తే మాత్రం ఆ లాభాల్లో వాటా తీసుకోనున్నాడట. ఇటీవలే జాను అనే చిత్రంలో నటించాడు శర్వానంద్ అయితే తమిళంలో పెద్ద హిట్ అయిన ఆ సినిమా తెలుగులో మాత్రం డిజాస్టర్ అయ్యింది. దాంతో శర్వానంద్ మార్కెట్ పడిపోయింది.