రజనీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడా ?

Published on Apr 13,2019 15:19 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నాడా ? అంటే అవుననే అంటున్నాయి చెన్నై వర్గాలు . ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ చిత్రాన్ని చేస్తున్న రజనీకాంత్ వయసు 68 సంవత్సరాలు . అయితే ప్రస్తుతం చేస్తున్న  మురుగదాస్ సినిమా కంప్లీట్ అయ్యాక మరో రెండు సినిమాలను చేసి సినిమాలనుండి రిటైర్ కానున్నట్లు తెలుస్తోంది . 

ఈ వయసులో ఇంకా ఫైట్స్ , డ్యాన్స్ లు చేయడం ఏంటి ? అని ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడట రజనీకాంత్ . అందుకే నటనకు గుడ్ బై చెప్పాలని లేదంటే ..... ఫ్యాన్స్ ఒత్తిడి అధికం అయితే అప్పుడు ఒకటి అరా ...... మాత్రం చేయొచ్చని అది కూడా డ్యాన్స్ , ఫైట్స్ ఉన్న సినిమాలు కాకుండా అని ఆలోచన చేస్తున్నాడట . 

అసలు రజనీకాంత్ బాబా సినిమా సమయంలో నటనకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు . అయితే మిత్రులు , సహనటులు , అభిమానుల ఒత్తిడిలో మళ్ళీ సినిమాలు చేస్తున్నాడు . నటనని పక్కన పెట్టి రాజకీయాల పై దృష్టి పెట్టనున్నాడట రజనీకాంత్ .