ఆ డైరెక్టర్ అనుష్క ని రెండో పెళ్లి చేసుకోనున్నాడా?

Published on Mar 01,2020 15:07 PM

సైజ్ జీరో చిత్ర దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి హీరోయిన్ అనుష్క ని రెండో పెళ్లి చేసుకోనున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. యువ దర్శకులు ప్రకాష్ కోవెలమూడి ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు తనయుడు అన్న సంగతి తెలిసిందే. మొదట హీరోగా నటించిన ప్రకాష్ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది దాంతో మెగా ఫోన్ పట్టాడు. అయితే పాపం సక్సెస్ అందుకోలేకపోయాడు ఈ దర్శకుడు. ఇక అనుష్క తో సైజ్ జీరో అనే చిత్రాన్ని చేసాడు.

సైజ్ జీరో చిత్రం చేయడంతో ఇద్దరి మధ్య మంచి స్నేహం వెల్లివిరిసిందని , ఆ తర్వాత అదే పెళ్ళికి దారి తీస్తోందని రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. అయితే అనుష్క పెళ్లి మీద పుకార్లు రావడం కొత్తేమి కాదు ఎందుకంటే ఆమెకు పెళ్లి కాలేదు దాంతో చాలా రోజులుగా ఈ కథనాలు వస్తూనే ఉన్నాయి. ప్రకాష్ కు పెళ్లి అయ్యింది కానీ విడాకులు కూడా అయ్యాయి దాంతో అనుష్క ని రెండో పెళ్లి చేసుకోనున్నాడు అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి