ఆ హీరో రెమ్యునరేషన్ 100 కోట్లా ?

Published on Mar 31,2020 12:11 PM
తమిళ స్టార్ హీరో విజయ్ రెమ్యునరేషన్ 100 కోట్లు అంటూ పెద్ద ఎత్తున చెన్నై లో ఊహాగానాలు బయలుదేరాయి. తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి స్టార్ డం ఉన్న హీరో ఇళయ దళపతి విజయ్ కావడం విశేషం. పక్కా మాస్ హీరో అయిన విజయ్ రజనీకాంత్ తో పోటీపడి మరీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఒక్క తమిళనాట మాత్రమే కాకుండా యావత్ భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరో రజనీకాంత్ కాగా అతడి తర్వాత అంతటి రెమ్యునరేషన్ అందుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు విజయ్.

నిన్న మొన్నటి వరకు 50 కోట్లు 70 కోట్లు మాత్రమే తీసుకున్న విజయ్ తాజాగా నటించబోయే తుపాకి 2 చిత్రంలో మాత్రం 100 కోట్లు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన తుపాకి పెద్ద హిట్ అయ్యింది దాంతో ఇన్నాళ్లకు ఆ సినిమాకు సీక్వెల్ చేస్తున్నారు విజయ్ - మురుగదాస్ లు. ఆ సినిమాతో సెంచరీ కొట్టబోతున్నాడన్న మాట విజయ్. ఇక ఈ చిత్రంలో కూడా హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నే ఎంపిక చేశారట.