ఆ హీరోయిన్ ని కిడ్నాప్ చేసారా ?

Published on Mar 02,2020 20:37 PM

ఇటీవల విడుదలైన రాహు చిత్రంలో హీరోయిన్ గా నటించిన కృతి గార్గ్ ని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. సంచలనం సృష్టించిన ఈ సంఘటన వివరాలలోకి వెళితే ....... ఫిబ్రవరి 28 న విడుదలైన రాహు చిత్రంలో హీరోయిన్ గా నటించింది కృతి గార్గ్ . అయితే ఆమె నటనకు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి ఫిదా అయినట్లుగా చెప్పి అతడి తదుపరి చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడని , ఆ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి ముంబై రావాలని పిలిపించుకున్నారట.

అయితే ఆ ఆగంతకుడి మాటలు నమ్మిన కృతి గార్గ్ ముంబై వెళ్ళింది. అయితే ముంబై వెళ్లిన తర్వాత నుండి కృతి గార్గ్ నెంబర్ స్విచ్చాఫ్ వస్తుండటంతో అనుమానం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు రాహు చిత్ర దర్శకుడు సుబ్బు. ప్రభాస్ హీరో అని సందీప్ రెడ్డి వంగా దర్శకుడు అని మాయమాటలు చెప్పడంతో వెళ్లినట్లుగా సమాచారం అందుతోంది అయితే  ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.