మెగా మేనల్లుడు తప్పు చేశాడా ?

Published on Dec 06,2019 16:55 PM

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్  తాజాగా ప్రతీ రోజూ పండగే అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 20 న బాలయ్య సినిమా రూలర్ కు పోటీగా విడుదల చేస్తున్నారు. అయితే ఇటీవల విడుదలైన ప్రతీ రోజూ పండగే ట్రైలర్ ఏమంత కొత్తగా అనిపించడం లేదు సరికదా ! శర్వానంద్ హీరోగా నటించిన శతమానం భవతి చిత్రం లా కనబడుతోంది.

దాంతో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్  ప్రతీ రోజూ పండగే చిత్రాన్ని చేసి తప్పు చేశాడా ? అన్న అనుమానం వస్తోంది. ఇక ఈ సినిమా విడుదల అయితే కానీ తెలీదు ఇది ప్రేక్షకులను మెప్పించే చిత్రమా ? లేక నొప్పించే చిత్రమా ? అన్నది. సాయి ధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా నటించిన ఈ చిత్రంలో సత్యరాజ్ కీలక పాత్రలో నటించాడు. డిసెంబర్ 20 న విడుదల అయితే కానీ తెలీదు శతమానం భవతి లాంటి కథనా ? లేదా ? అన్నది.