జెమిని టీవీలో ఆ షో ఆగిపోయిందా ?

Published on Mar 07,2020 11:19 AM

జెమిని టీవీలో కొత్తగా 5 షోలు స్టార్ట్ చేయాలనీ డిసైడ్ అయ్యారు అంతేకాదు అందులో నాలుగు స్టార్ట్ అయ్యాయి కూడా అయితే ఒక షో మాత్రం ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో అస్సలు చెప్పడం లేదు దాంతో ఆ షో ఆగిపోయిందనే మాటలు వినిపిస్తున్నాయి. అనసూయ తో తల్లా పెళ్ళామా , రోజా తో అమ్మ సరిలేరు నీకెవ్వరు , సంగీత దర్శకుడు కోటి తో రాగాలపల్లకిలో ,శ్రీముఖి తో సెలబ్రిటీ కబడ్డీ లీగ్ వంటి విభిన్న కార్యక్రమాలను ప్లాన్ చేసారు అవి స్టార్ట్ అయ్యాయి కూడా.

అయితే వీటితో పాటుగానే జగపతిబాబు వ్యాఖ్యాతగా ఆటోగ్రాఫ్ అనే కార్యక్రమం స్టార్ట్ అవుతుందని ప్రకటించారు సదరు ఛానల్ వాళ్ళు. కానీ మిగతా నాలుగు స్టార్ట్ అయ్యాయి కానీ జగపతిబాబు హోస్ట్ గా వ్యవహరించనున్న ఆటోగ్రాఫ్ సంగతి  మాత్రం తెలియడం లేదు. దాంతో ఆ కార్యక్రమం ఆగిపోయినట్లే అని అంటున్నారు. అయితే అది ఆగిపోయిందా ? లేదా ? అన్నది వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే కానీ తెలీదు.