ఆ షో ఆగిపోయిందా ?

Published on Nov 19,2019 12:46 PM

మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీప్రసన్న వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో '' ఫీట్ అప్ విత్ స్టార్స్ '' ఆగిపోయిందని గుసగుసలు మొదలయ్యాయి. స్టార్ హీరోయిన్ లతో యంగ్ స్టార్ లతో రచ్చ రంబోలాగా సాగింది ఈ ఫేట్ అప్ విత్ స్టార్స్ కార్యక్రమం. అడల్ట్ షోగా సాగిన ఈ కార్యక్రమం యూత్ ని బాగానే ఆకట్టుకుంది అయితే ఈ షో ఎందుకు ఆగిపోయిందో తెలీక సతమతం అవుతున్నారు.


రెగ్యులర్ గా సాగే ఈ కార్యక్రమం నుండి కొత్తగా ఇంటర్వ్యూలు ఏవి రాకపోవడంతో ఈ టాక్ వస్తోంది. మంచు లక్ష్మీ నటిగా సత్తా చాటింది. నెగెటివ్ పాత్ర పోషించి అవార్డు సైతం అందుకుంది. పలు చిత్రాలను నిర్మించి తన ప్రత్యేకత నిరూపించుకుంది. ఇప్పటికే పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన మంచు లక్ష్మీ బహుముఖ ప్రజ్ఞాశాలి గా నిరూపించుకుంది.