అత్తా కోడళ్ల మధ్య గొడవలా ?

Published on Apr 28,2020 16:45 PM
అత్తా కోడళ్ళు అయిన అమల - సమంత ల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతకొంత కాలంగా అక్కినేని కుటుంబంలో వివాదాలు జరుగుతూనే ఉన్నాయని , అయితే అవి మొదట చిన్నవిగా ఉండేవని కానీ రానురాను అవి పెద్దవిగా మారాయని అందుకే అమల - సమంత ల మధ్య దూరం పెరిగిందని ఫిలిం నగర్ సర్కిల్లో వినిపిస్తోంది. సాధారణంగా అత్తా - కోడళ్ల మధ్య అంతగా సాన్నిహిత్యం ఉండదు. ముఖ్యంగా తెలుగు వాళ్లలో ఇది మరీనూ. మొదట్లో అమల - సమంత బాగానే ఉన్నప్పటికీ మిగతా ఇళ్లల్లో ఉన్నట్లుగానే చిన్న చిన్న విషయాలు పెద్దవి అయ్యాయట.

దాంతో పెద్దగా ఈ ఇరు కుటుంబాల మధ్య అంతగా రాకపోకలు  తెలుస్తోంది. పైగా సమంతకు ఏమాత్రం ఖాళీ దొరికినా చెన్నై కి వెళ్లడం తన పేరెంట్స్ తో ఉండటం లేదంటే చైతు ని తీసుకొని ఏదైనా ప్లేస్ కు వెళ్లడం చేస్తోందట దాంతో గ్యాప్ ఎక్కువ అవుతోంది. నాగార్జున , అమల , అఖిల్ ఒక చోట ఉంటున్నారు అలాగే నాగచైతన్య - సమంత మరో చోట ఉంటున్నారు. ఆదివారం రోజున కలవాలని అనుకున్నారట కానీ ఈమధ్య అత్తా కోడళ్ల మధ్య దూరం పెరగడంతో కలవడం లేదని వినికిడి.