ఆ బయోపిక్ లో శోభన్ బాబు పాత్ర ఉంటుందా ?

Published on Nov 01,2019 17:07 PM

పురుచ్చితలైవి గా పేరు గాంచిన జయలలిత బయోపిక్ ని గ్రాండ్ లెవల్ లో ప్లాన్ చేస్తున్నారు. దర్శకులు ఏ ఎల్ విజయ్ ఈ బయోపిక్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ భామ కంగనా రనౌత్ నటిస్తోంది. ఈ పాత్ర కోసం , మేకోవర్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది కంగనా. అయితే జయలలిత బయోపిక్ అంటే ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు పాత్ర తప్పనిసరి.

కానీ ఈ బయోపిక్ లో శోభన్ బాబు పాత్ర ఉంటుందా ? ఉంటే అది పూర్తిస్థాయిలో జయలలిత - శోభన్ బాబు ల మధ్య ఉన్న బంధాన్ని చూపెట్టేలా ఉంటుందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. శోభన్ బాబు పాత్ర ఉంటే జయలలిత పాత్ర ని తక్కువ చేసినట్లే అవుతుందని లేదంటే మరో రకమైన భావన కలుగుతుందని తీసివేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అయితే శోభన్ బాబు పాత్ర ఉన్నా లేకున్నా జయలలిత బయోపిక్ సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది ఎందుకంటే రాజకీయాల్లో ఆడపులి లా విజృంభించింది మరి.