త్రివిక్రమ్ - అల్లు అరవింద్ ల మధ్య గొడవ జరిగిందా ?

Published on Dec 19,2019 22:34 PM

దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు నిర్మాత అల్లు అరవింద్ ల మధ్య గొడవ జరిగినట్లు ఫిలిం నగర్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇంతకీ ఈ ఇద్దరి మధ్య వాగ్వాదం ఎందుకు జరిగిందో తెలుసా ..... '' అల .... వైకుంఠపురములో '' చిత్ర నిడివి పట్ల నట ! తాజాగా అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల .... వైకుంఠపురములో చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా నిడివి మూడు గంటలు ఉందట. ఈరోజుల్లో మూడు గంటల సినిమా అంటే ప్రేక్షకులు అసహనానికి గురి కావడం ఖాయమని అందుకే దాన్ని వీలైనంత వరకు తగ్గించాలని గట్టిగా చెప్పాడట అల్లు అరవింద్.

అయితే మూడు గంటల పాటు సినిమా ఉండాల్సిందే ! అనవసరపు సన్నివేశాలు సినిమాలో లేవు అని వాదించాడట దర్శకులు త్రివిక్రమ్. అయితే సినిమా ఎక్కువ సేపు ఉంటే ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారు కాబట్టి తగ్గించాల్సిందే అని కొన్ని ఉదాహరణలు చెప్పాడట దాంతో చేసేదిలేక 2గంటల 45 నిమిషాల నిడివి వచ్చేలా చేస్తానని చెప్పాడట త్రివిక్రమ్. మూడు గంటల సినిమా అంటే ప్రేక్షకులను కూర్చోబెడితే బాగానే ఉంటుంది కానీ ఏమాత్రం బోర్ కొట్టినా మొదటికే మోసం వస్తుంది అందుకే అల్లు అరవింద్ అలా చెప్పాడని అంటున్నారు. అయితే ఏది ఏమైనా సినిమా మంచి గురించేగా ....... కొన్ని వాదనలు తప్పదు మరి సినిమా సక్సెస్ కోసం.